జగన్ గారూ! ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారా?: నారా లోకేశ్

  • ఏంటీ సిగ్గుమాలిన ప‌నులు? 
  • ‘అమ్మఒడి’ అంటూ వైసీపీ బ‌డులు చేస్తున్నారా?
  • తెలుగు తల్లి పాటను ఆలపించడం రద్దు చేసి వైసీపీ పాట‌లు పెట్టేశారా?
‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న.. అభివృద్ధికి పెద్దదిక్కు మన జగనన్న’ పాటకు గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులతో డ్యాన్స్ వేయించడం దారుణమని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేశారా? అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ప్ర‌భుత్వ గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో ఏంటీ సిగ్గుమాలిన ప‌నులు? ‘అమ్మఒడి’ ఇస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వైసీపీ బ‌డులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయంగా చేశారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగు తల్లి పాటను ఆలపించడం రద్దు చేసి వైసీపీ పాట‌లు పెట్టేశారా? అంటూ ధ్వజమెత్తారు.
Go Back to Shorts
cm
Jagan
Telugudesam
Nara Lokesh
AmmaOdi

More Telugu News